chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 5:41 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షిక క్రీడా సంబరాలు 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 19:

కుప్పం డిగ్రీ కళాశాలలో మూడు రోజులపాటు వార్షిక క్రీడా పోటీలు అంగ రంగావైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ బీసీ నాగరాజు మాట్లాడుతూ…, మానసిక ఉల్లాసానికి క్రీడల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ, జోనల్ స్థాయిలో విస్తృతంగా ప్రదర్శించుకున్నారని ప్రత్యేక అభినందనలు తెలిపారు. కళాశాల వైస్‌చైర్మన్ సాగర్ రాజు మాట్లాడుతూ.., క్రీడా పోటీల్లో గెలిచిన విద్యార్థులకు అందజేసే మెరిట్ సర్టిఫికెట్లు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తాయని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షాట్‌పుట్, క్వాడ్ వంటి క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ శాంతా నాగరాజ్, ప్రిన్సిపాల్ సుధారాణి, డైరెక్టర్ సుధాకర్, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.