chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:48 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం డాక్యుమెంటరీ రైటర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 23:

 

చిత్తూరు జిల్లా కుప్పం డాక్యుమెంటరీ రైటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా రఘుస్వామి, ఉపాధ్యక్షుడిగా యశ్వంత్, ప్రధాన కార్యదర్శిగా పార్థసారథి, జాయింట్ కార్యదర్శిగా ఎస్. దయాకర్, కోశాధికారిగా రామ్మూర్తి, సహాయ కోశాధికారిగా విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రఘుస్వామి మాట్లాడుతూ, డాక్యుమెంటరీ రచయితల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కార్యవర్గం సమిష్టిగా పనిచేస్తుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసి, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.