chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 8:35 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం చైర్మన్ బరిలో వైసీపీ నుంచి కె.గణేష్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ

 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 17:

 

కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కె. గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం కుప్పం మున్సిపల్ నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ పదవికి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో కుప్పంలో రాజకీయ సందడి నెలకొంది. నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.