chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 5:47 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం ఏఎంసీ పదవీకాలం పొడిగింపు

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు17:

 

కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకమండలి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఏఎంసీ చైర్మన్ జి.ఎం. రాజుతో పాటు మొత్తం 15మందితో కూడిన పాలకమండలి పదవీకాలాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెట్ల చట్టం–1966లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఈ పొడిగింపు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు సంబంధించిన మార్కెటింగ్ కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు–విక్రయాల పర్యవేక్షణ తదితర అంశాల్లో పాలకమండలి కీలకపాత్ర పోషిస్తోంది. పదవీకాలం పొడిగింపుతో ప్రస్తుత పాలకమండలి మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది.