
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు15:
కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ డాక్టర్ బి.సి. నాగరాజ్, వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ బి.సి.నాగరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో పాటు దేశభక్తిని పెంపొందించే పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన విజన్‌ను ఏర్పరచుకుని, దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంతో పాటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కరన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ స్ఫూర్తితో సాగిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.