chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:55 am Digital Edition : CHITTOORE EXPRESS

*కుప్పం ఇంజనీరింగ్ కళాశాలకు విశేష గుర్తింపు* *చైర్మన్ డాక్టర్ బి.సి. నాగరాజ్‌కు*  *‘సర్ విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డు–2026’*

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 16:

 

ఇంజనీరింగ్ విద్యారంగంలో విశేష కృషికి కుప్పం ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కళాశాల చైర్మన్ డాక్టర్ బి.సి.నాగరాజ్‌కు ‘సర్ విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డు–2026’ ప్రదానం చేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా కుప్పం ఇంజనీరింగ్ కళాశాలకు గుర్తింపు లభించడం విశేషం. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహాదారుగా పేర్కొన్న వ్యక్తి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి మనవడు డాక్టర్ జి.సుబ్రమణ్య శర్మ, కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సాయిరాం ప్రసాద్ తదితరుల చేతుల మీదుగా డాక్టర్ బి.సి.నాగరాజ్ అవార్డును స్వీకరించారు. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంతో పాటు, ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ కల్పించడం లక్ష్యంగా కళాశాల ముందుకు సాగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యమిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. కళాశాల అభివృద్ధికి డాక్టర్ బి.సి. నాగరాజ్ అందిస్తున్న సేవలు, విద్యారంగంపై ఆయనకున్న అంకితభావానికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలుస్తోంది. ఈ అవార్డు కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచడంతో పాటు, భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన ఇంజనీర్లను తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని కళాశాల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కుప్పం ఇంజనీరింగ్ కళాశాలకు లభించిన ఈ గుర్తింపుపై అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం విద్యాసంస్థ అభివృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.