chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 8:42 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన  షైక్ మొహమ్మద్ హుస్సేన్ 

 

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:

 

చిత్తూరు జిల్లా కుప్పం రెవెన్యూ డివిజనల్ అధికారిగా షైక్ మొహమ్మద్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన ఆర్డీవోకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిపాలనా వ్యవహారాలు, పెండింగ్ దరఖాస్తులు, భూ సంబంధిత అంశాలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని నూతన ఆర్డీవో తెలిపారు.