chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:32 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో సెక్షన్‌ 163 అమలు గుంపులుగా గుమికూడితే చర్యలు తప్పవు కాన్వాయ్‌లు, ర్యాలీలకు అనుమతి లేదు ఏఎస్పి బొడ్డు హేమంత్ ఐపీఎస్ 

కుప్పం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్‌, అక్టోబర్‌ 17:

 

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పట్టణ పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కుప్పం సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ బి. హేమంత్‌ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో నలుగురికి మించి గుమికూడరాదని, అనుచరులతో కాన్వాయ్‌లు, ర్యాలీలుగా వచ్చి హంగామా సృష్టించకూడదని హెచ్చరించారు. నామినేషన్‌ కేంద్రం పరిసరాలతో పాటు పట్టణంలో పోలీసుల నిఘా కొనసాగుతుందని, అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్‌ అధికారికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ బి .హేమంత్‌ కోరారు.