chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 10:22 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ 10 పరిధిలోని 23, 24 వార్డుల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమం గవర్నమెంట్ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచనలు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మార్గదర్శకత్వంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. అవసరమైన వారికి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడ అడ్వైజరీ సభ్యుడు రాజ్‌కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, క్లస్టర్ ఇంచార్జ్ సోమశేఖర్, బూత్ ఇంచార్జ్ భరత్, వినయ్, యూనిట్ ఇంచార్జ్ వేణు, రెస్కో డైరెక్టర్ ఆర్ముగం, మాజీ ఎంపీటీసీ ఉమాపతి, గంగమ్మ గుడి డైరెక్టర్ శారదమ్మతో పాటు నరేష్, ముని, జమీర్, దేవ, 23వ వార్డు పార్టీ అధ్యక్షుడు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.