chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:20 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో వర్చువల్ విధానంలో టీడీపీ పసుపు పండుగ  రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ చెక్కునత్తం మణి

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే26:

 

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు పండుగ మహానాడు-2026 కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ చెక్కునత్తం మణి తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి నారా లోకేష్ సూచనల మేరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని 12 క్లస్టర్లలో నేడు, రేపు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మహానాడులో చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చెక్కునత్తం మణి పిలుపునిచ్చారు.