chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:32 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో రింగ్ రోడ్ పనులకు శ్రీకారం  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 22:

 

కుప్పంపట్టణంలోని ప్రతి ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. 2014 – 2019 కాలంలో మంజూరైన ఈ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా నిలిచిపోగా, ప్రస్తుతం మళ్లీ పునఃప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆర్మ్-2, ఆర్మ్-3 పనుల కోసం రూ.30 కోట్ల నిధులు కేటాయించగా, ఆర్మ్-2 పనులకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పీకే ఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబులు కుప్పం పట్టణ పరిధిలోని డీకే పల్లె చెరువు సమీపంలో బుధవారం భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో నాలుగు నెలల్లో ఆర్మ్-3 పనులను కూడా ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు వారు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కీలకమైన రింగ్ రోడ్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుందన్నారు. నాణ్యతతో,సుందరంగా రోడ్లను నిర్మించి ప్రజల అవసరాలను తీర్చేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  రాజ్ కుమార్, టిటిడి బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం, కాణిపాకం వెంకటేష్, జిమ్ దాము, సోము, గాజుల గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్, కన్నన్, వేలు, మంజునాథ్, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ నరేష్, కూటమి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.