chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:53 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో మ్యాక్స్ బేకరీలో అగ్ని ప్రమాదం షార్ట్‌సర్క్యూట్‌తో బేకరీలో మంటలు.. భారీగా పరికరాలు దగ్ధం

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 06:

 

కుప్పం పట్టణంలోని మ్యాక్స్ బేకరీలో సోమవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేకరీ వెనుక భాగంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వ్యాపించడంతో తినుబండారాల తయారీకి వినియోగించే యంత్రాలు, పరికరాలు, ఇతర సామగ్రి దగ్ధమైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బేకరీలోని పరికరాలు, సామగ్రి దగ్ధం కావడంతో గణనీయమైన నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం సుమారు రూ.20 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే నష్టం విలువపై అధికారికంగా పూర్తి అంచనా వేయాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.