chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 8:19 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో మెగా కంటి పరీక్షా శిబిరం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 14:

 

కుప్పం పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో, పీఈఎస్ ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో మెగా కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ప్రాథమిక వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు తగ్గిన వారిని గుర్తించి, అవసరమైన వారికి శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. స్వల్ప చూపు సమస్యలు ఉన్న వారికి కంటి అద్దాలు ఉపయోగించాలని వైద్యులు తెలిపారు. మొత్తం 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 20 మందిని ఉచిత శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ ఛైర్‌పర్సన్, అడ్వైజర్ మహేష్ అంబా, క్లబ్ ప్రెసిడెంట్ డా. సుదర్శన్ మాట్లాడుతూ, వృద్ధులకు కంటి చూపు ఎంతో ముఖ్యమని తెలిపారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ కంటి సమస్యలు రావడం సాధారణమని, అందువల్ల తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయడం లయన్స్ క్లబ్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వం, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ చరణ్, సభ్యులు జయరాం నాయుడు, డా. కృష్ణమూర్తి, నాగరాజు, సతీష్, డా. వరదరాజులు, కె ఈ సి ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ అనిల్, లియో క్లబ్ విద్యార్థులు, పీఈఎస్ ఆసుపత్రి వైద్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.