
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పిఎంకె ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ రాములవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్థానిక అన్న క్యాంటీన్‌లో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హంద్రీనీవా ద్వారా కుప్పం చెరువుకు చేరుకున్న కృష్ణా జలాలను స్థానిక మహిళలు బిందెలతో సేకరించి ర్యాలీగా తీసుకెళ్లి, 50 అడుగుల చంద్రబాబు నాయుడు కటౌట్‌కు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తదుపరి కుప్పం పట్టణ చెరువు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక బస్టాండ్ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 76 కిలోల భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాల్లో టిటిడి బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం, డాక్టర్ రాజ్ కమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, కాణిపాకం వెంకటేష్, తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ బి. ఎం.కె రవిచంద్ర, గాజుల గోపీనాథ్,ఆర్ఆర్ రవి, సోమశేఖర్, వెంకటేష్,కన్నన్,యల్లప్ప,రెస్కో డైరెక్టర్ ఆర్ముగం, లోకనాథ్,బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి, తులసినథ్,పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.