chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:34 am Digital Edition : CHITTOORE EXPRESS

కిషోరీ బాలికలకు చైతన్య బాట సెషన్ -4

దొరవారి సత్రం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే12:

 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని దొరవారిసత్రం మండలం తల్లంపాడు పంచాయతీ సచివాలయ పరిధిలోని మావిళ్ళపాడు అంగన్వాడి సెంటర్ నందు ఆ పంచాయతీ మొత్తం అంగన్వాడి సెంటర్లో కలిసి కిషోర్ వికాసం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సులూరుపేట ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోతి కిరణ్ ఆదేశాల మేరకు సూపర్వైజర్ అంకమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కిషోర్ బాలికల్లో అవగాహన ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లో మే ఒకటి నుంచి జూన్ 9 వరకు ప్రతి మంగళవారం శుక్రవారం గ్రామస్థాయిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కిషోరీ వికాసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విద్య ప్రాముఖ్యత, పోక్సో చట్టం, బాల్య వివాహాలు నివారణ, ఆర్థిక సాధికారత, పోషకాహారం, పరిశుభ్రత, జీవన నైపుణ్యాలు, రుతుక్రమ పరిశుభ్రత, రక్తహీనత నివారణ, వంటి కీలక అంశాలపై దశలవారీగా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, నేతాజీ నగర్ అంగన్వాడి టీచర్ కే రాజేశ్వరి, దిగువ మేలుపాకు అంగన్వాడీ టీచర్ పి రమణమ్మ, మావిలపాడు అంగన్వాడీ టీచర్ జి శంకరమ్మ, మావిలపాడు కిషోర్రీ బాలికలు తదితరులు పాల్గొన్నారు.