chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 9:26 am Digital Edition : CHITTOORE EXPRESS

కార్మిక లోకానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపు

సూళ్లూరుపేట, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 23:

 

తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరగనున్న ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. సూళ్లూరుపేటలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 26న తిరుపతి ఇందిరా మైదానంలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు