కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 11:
కుప్పం పరిసర ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కడా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు కడపిడి వికాస్ మరమ్మత్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 73 రోజులపాటు కొనసాగుతుందని, శిక్షణలో పాల్గొనే యువతకు ఎన్ ఎస్ డి సి ద్వారా సర్టిఫికేట్ అందజేయబడుతుందని, శిక్షణ పూర్తిచేసిన వారికి 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్, అలాగే జాబ్ ఓరియెంటెడ్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, ప్రెసెంటేషన్ స్కిల్స్, మానేజ్మెంట్ స్కిల్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నామన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సోలార్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అసెంబ్లర్, క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టిషనర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్ వంటి రంగాలలో శిక్షణ అందించబడుతుందన్నారు. శిక్షణ పొందిన వారికి కుప్పం పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ శిక్షణలో చేరదలచిన అభ్యర్థులు ఆధార్ కార్డ్‌తో కుప్పం ఎరియాస్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం తనుజ (63019 94961), రాజ్ (7013701423), జ్యోతి (96035 43211) లను సంప్రదించవచ్చని తెలిపారు.