chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 8:01 am Digital Edition : CHITTOORE EXPRESS

కర్లగట్టలో పోలీసుల పల్లెనిద్ర మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 06:

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పోలీసులు కర్లగట్ట గ్రామాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు, కుప్పం ఏఎస్పీ హేమంత్ బొడ్డు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబుడుగూరు ఎస్‌ఐ నరేష్‌లు శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, POCSO చట్టం, దొంగతనాలు, ఆర్థిక నేరాలపై ప్రజలకు వివరించారు. అలాగే చిన్నారులు అదృశ్యమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, బాల్యవివాహాల నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలను గణనీయంగా నివారించవచ్చని పోలీసులు తెలిపారు.