chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:53 am Digital Edition : CHITTOORE EXPRESS

కర్ణాటకలో జనసేన పార్టీ సిద్ధాంతాల ప్రచారం చింతామణి నియోజకవర్గంలో పార్టీ భావజాల విస్తరణకు కృషి

చిక్కబళ్లాపూర్, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 23:

 

జనసేన పార్టీ సిద్ధాంతాలు, సామాజిక పరివర్తన లక్ష్యాలను కర్ణాటకలోని సామాన్య ప్రజలు, యువతకు చేరువ చేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పార్టీ నాయకులు తెలిపారు. చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి నియోజక వర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చింతామణి నియోజక వర్గ జనసేన పార్టీ సాదక్‌, అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు దేవరాజ్ డిచ్చి మాట్లాడుతూ, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ యువతను చైతన్యవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాసేవ, సామాజిక బాధ్యత, పారదర్శక పాలన లక్ష్యాలతో జనసేన పార్టీ భావజాలాన్ని కర్ణాటకలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.