chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:24 am Digital Edition : CHITTOORE EXPRESS

కన్నడ శాఖలో బసవ జయంతి ఘనంగా నిర్వహణ

గుడిపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 21

కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం కన్నడ శాఖలో బసవ జయంతి ఘనంగా నిర్వహించారు. కన్నడ శాఖాధిపతి డా.ఎమ్మెస్ దుర్గా ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బసవ తత్వం, ఆయన జీవన విధానంలోని విశిష్టతను వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య జయలలిత ఆధునిక సమాజంలో బసవ ఆలోచనల ప్రాముఖ్యతను వివరించారు. పరిశోధక విద్యార్థులు రూపేష్ కుమార్, అభిషేక్, నటరాజ్, మంజునాథ్, అనిల్ కుమార్ బసవ జీవిత చరిత్ర, తత్వం, సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యాసరావు, తీర్థప్రసాద్, సదాశివ సమన్వయం చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉపకులపతి ఆచార్య ఎల్ సి మల్లయ్య, రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు అభినందనలు తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రజా సంబంధాల అధికారి డా. పి ఎస్ గణేష్ మూర్తి వెల్లడించారు.