
కడప,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 31:
రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కడప వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కడప ఎమ్మెల్యే మాధవి అధికారులను ఆదేశించారు. కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలు, పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి, రైతులు, వ్యాపారులకు అందుతున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి యార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉస్మాన్, వైస్ చైర్మన్ పాలంపల్లి సుబ్బారెడ్డి, సభ్యులు శిరీష, హరిత, శోభ సింధు తదితరులు పాల్గొన్నారు.