chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 1:18 pm Digital Edition : CHITTOORE EXPRESS

కంగుందిలో రెవెన్యూ అధికారికి మాతృవియోగం

 

 

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5 :

 

కుప్పం మండలం కంగుంది గ్రామ రెవెన్యూ అధికారి కొలందాప్ప మురుగేష్ మాతృమూర్తి చన్నమ్మ ఆగస్టు 5న కన్నుమూశారు. ఆమె మృతి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తమ కుటుంబానికి ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ, కుటుంబ అభ్యున్నతి కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన తల్లిని కోల్పోవడం తీరని లోటుగా మిగిలిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చన్నమ్మ మృతి విషయం తెలుసుకున్న కంగుంది గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, స్నేహితులు, బంధువులు నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చన్నమ్మ దహన సంస్కారాలు తమ స్వగ్రామమైన సింగసముద్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.