chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 10:59 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఓ.ఎన్ కొత్తూరు గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ

గుడుపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 06:

 

బీజేపీ46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు “మా ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుడుపల్లి మండలం ఓ.ఎన్ కొత్తూరు గ్రామంలో నూతనంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. గుడుపల్లి మండల బిజెపి అధ్యక్షులు రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్, కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఆంజనేయ, మండల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నూతన కండువాలను పంపిణీ చేయడంతో పాటు నేతి మిఠాయిలు, చాక్లెట్లు పంచుకొని పార్టీ లక్ష్యాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు మాజీ ఎంపిటిసి వెంకటప్ప, రవీంద్ర నాయుడు, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు శివకుమార్, పవన్ కుమార్, వెంకటస్వామి, సోమశేఖర్, జమున, మునియప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. “భారత్ మాతాకీ జై” నినాదాలతో కార్యక్రమం ముగిసింది.