chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:02 am Digital Edition : CHITTOORE EXPRESS

ఐజర్ లో 7వ వార్షికోత్సవ వేడుకలు  గోల్డ్, సిల్వర్ మెడలిస్టులకు సన్మానం

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్ జూలై 10
శ్రీకాళహస్తి  తిరుపతి ఐజర్ నందు ఏడవ వార్షికోత్సవం ను పురస్కరించుకొని వార్షికోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలలో ఈ ఏడాది ఉత్తీర్ణత పొందిన విద్యార్థినీ విద్యార్థులకు, ముఖ్యఅతిథి నేషనల్ సెక్యూరిటీ అడ్వైసరీ బోర్డు ఫార్మర్ చైర్మన్ సతీష్ రెడ్డి  ఐజర్ డాక్టర్ శాంతాను భట్టాచార్య చేతుల మీదుగా ఉత్తీర్ణత పొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడలను అందజేశారు. ఈ సందర్భంగా ఐజర్ డైరెక్టర్ మరియునేషనల్ సెక్యూరిటీ అడ్వైసరీ బోర్డు ఫార్మర్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఐజర్ విద్యాసంస్థ
విద్యార్థుల ప్రతిభను కనబరిచిన వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఈ విద్యా సంస్థ ఎంతగానో దోహదపడుతుందని ఈ విద్యాసంస్థలు విద్యాభ్యాసం చదివిన విద్యార్థిని, విద్యార్థులు నేడు ఉత్తీర్ణత పొంది వారి జీవితంలో వారి పరిశోధనలో  అత్యున్నత స్థానాన్ని సంపాదించుకోవాలని, తెలియజేశారు. ఐఐటి ఐజర్ నందు  ఉత్తీర్ణత పొందిన విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అభివృద్ధి పరిచే విధంగా అనేక, సంక్షేమ పథకాలతో బ్యాంకు లోన్లను అందజేస్తుందని, విద్యార్థిని విద్యార్థులు ఈ బ్యాంక్ లోన్ ద్వారా తమ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకొని దేశ ప్రగతికి దోహదపడే విధంగా  పరిశోధనలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.