chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 8:19 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఏపీడబ్ల్యూజేఎఫ్ శ్రీకాళహస్తి కమిటీ 

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:

శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ శ్రీకాళహస్తినియోజకవర్గ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే ఎఫ్ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వళిగలం గోపి, జిల్లా కన్వీనర్ తులసీ రామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కావేరిపాకం వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా పెరిమిడి రఘు, ఉపాధ్యక్షులుగా బాలు (బాబు), మునిచంద్ర, కోశాధికారిగా చక్రపాణి, సహాయ కార్యదర్శిగా బాలచంద్ర ఎన్నికయ్యారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు,హక్కుల సాధనకై పెడరేషన్ పోరాడుతుందని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జర్నలిస్టు సమస్యల పోరాటానికై మార్చి 4న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణు గోపాల్, సీనియర్ పాత్రికేయులు బాలచంద్ర(వీ2), కామేష్, హరిబాబు, ధనశేఖర్, హకీం తదితరులు పాల్గొన్నారు.