ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్. మార్చి13:
ఎస్ఆర్ పురం మండలాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం రామకృష్ణాపురం గ్రామంలో సుమారు 24 లక్షల రూపాయల నిధులతో వేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు అలాగే ఒడ్డుపల్లి వద్ద ఐదు లక్షల రూపాయల మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అలాగే చేకూరీ వారి ఇండ్లు గ్రామంలో సుమారు పది లక్షల రూపాయల సిమెంట్ రోడ్డును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగం ప్రారంభించారు… అనంతరం వేణుగోపాలపురం పంచాయతీ చిన్న బపనపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు ప్రారంభించారు అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు అనంతరం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 47 మందికి48 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు… అనంతరం కటికపల్లి మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం వేమన నాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు… ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు సహకార సంఘ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎంపీడీవో వనజ, మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి తరుగు పూర్ణిమ బాబు, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ నాయుడు మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు నియోజకవర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ సిసి రోడ్డు కాంట్రాక్టర్ లు పైనేని బాలాజీ, ధనుంజయ నాయుడు వాటర్ ప్లాంట్ కాంట్రాక్టర్ రాకేష్ , టిడిపి నాయకులు రామిరెడ్డి, మాధవరెడ్డి అన్నామలై రెడ్డి మార్కొండ రెడ్డి కృష్ణ యాదవ్ నాగిరెడ్డి సుధాకర్ రెడ్డి ఇజ్రాయిల్ , కటికపల్లి మాజీ ఎంపీటీసీ కేఎం రవి, జిల్లా మాజీ కార్య నిర్వహణ కార్యదర్శి శేఖర్, టిడిపి మాజీ యువత అధ్యక్షుడు చంద్రబాబు రెడ్డి జీవన్ రెడ్డి మాజీ సర్పంచ్ కుప్పయ్య, జయరాజ్ గజేంద్ర, పెద్ద తయ్యూరు హేమాద్రి , శకుంతల,త్యాగరాజు నాయుడు, జలంధర్ నాయుడు, వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.