
ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 11:
ఎస్ ఆర్ పురం మండలంలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎస్ఆర్ పురం మండలం ఎస్ఆర్ పురం రెవిన్యూ శంకరయ్య కు కుమారుడు మహేష్ కు ఇంటి స్థలం రిజిస్టర్ చేసుకున్నారు. ఇదే స్థలాన్ని కొంతమంది తాసిల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరోసారి రిజిస్టర్ చేసుకున్నారు దీనిపై తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు.తాసిల్దార్ వెంటనే స్పందిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాడు పొదలపల్లి నేడు ఎస్ఆర్ పురం లో ఏకంగా తాసిల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఫోర్జరీ చేసిన వ్యక్తిపై ఇంతవరకు చర్యలు చేపట్టలేదు అధికారులు నిద్రమత్తు వీడి చర్యలు చేపట్టాలని మండల ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. లేదంటే మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉంది దీనిపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. నా ఇంటి స్థలం నాకు ఇప్పించండి అని మహేష్ రెవిన్యూ శాఖ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.