ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 06:
ఎస్ఆర్ పురం మండలం పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు హాజరయ్యారు అనంతరం జండా ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీఅభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ప్రతి బిజెపి కార్యకర్త తెలియజేయాలని అన్నారు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి రాజేంద్రన్ .. మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి రెడ్డి, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు జిల్లా ఉపాధ్యక్షులు మణి వర్మ జీకే చౌదరి స్నేహ భారతి ఢిల్లీ బాబు చంద్రశేఖర్ మురళి వెంకటేష్ దేవరాజులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు