ఎస్ ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి14:
ప్రతి జన సైనికుడికి అండగా నేనుంటా అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి ,మాల కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ పొన్న యుగంధర్ అన్నారు. శనివారం ఎస్ఆర్ పురం మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ పొన్నా యుగంధర్ పాల్గొన్నారు మండల కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించరూ అనంతరం జనసేన ఉపాధ్యక్షుడు చందు,పుల్లూరు సర్పంచ్ భవ్య పవన్ ఆధ్వర్యంలోభారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో అందరూ నడవాలని ఆయన ఆశయాలను నెరవేర్చాలని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు స్వచ్ఛందంగా యువకులు ముందుకు వస్తున్నారని జనసేన పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిరంజీవి, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చందు,, పుల్లూరు సర్పంచ్ భవ్య పవన్ ఉపాధ్యక్షుడు చార్లెస్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హరి, వీర మహిళ సుబ్బలక్ష్మి, రాజేష్, జనసేన నాయకులు జాఫర్, సాయి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.