
ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్10:
ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ థామస్ను బీజేపీ రాష్ట్ర నాయకుడు సురేష్ వర్మ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను కలిసిన ఎస్ఆర్ పురం మండలం ఊడమలకుర్తి మాజీ సర్పంచ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ వర్మ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సూచించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సురేష్ వర్మకు సూచించారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది.