పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:
పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని బైరెడ్డిపల్లి ఎంపీడివో ఉపేంద్ర శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అకౌంట్స్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తూ ప్రమోషన్ పై బైరెడ్డిపల్లి ఎంపీడివో గా ఇక్కడికి వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నుంచి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలసి సన్మానించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు.