chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 9:53 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 28:

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, కుప్పం పట్టణం కొత్తపేట 11వ క్లస్టర్ పరిధిలోని 15 వ వార్డులో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పిఎంకె ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ హాజరై లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పిఎంకె ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ , చిత్తూరు జిల్లా అధ్యక్షులు షణ్ముగం మాట్లాడుతూ… ఎన్టీఆర్ భరోసా పింఛన్ వృద్ధులు, విధవలు, వికలాంగులు వంటి అర్హులైన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదానికి నిదర్శనమని పేర్కొంటూ కుప్పంలో పుడితే పేదరికం ఉండదని వారు తెలిపారు. అలాగే వికలాంగులకు కొత్త పెన్షన్లు ఇస్తూ చివరి నెల ఈ నెలది కలిపి 12000 గా ఈరోజు పింఛన్ ను అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం ప్రజల సమస్యలను గుర్తించి ఎల్లప్పుడూ ప్రజల పక్కనే నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, యూనిట్ ఇంచార్జ్ అప్పు (ముఖేష్) స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.