chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 7:28 am Digital Edition : CHITTOORE EXPRESS

ఎం.ఎం. వాడలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు భూమిపూజ

శ్రీకాళహస్తి పురపాలక సంఘం పట్టణ పరిధి నందు  ఎం.ఎం. వాడలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ శ్రీకాళహస్తి శాసనసభ్యులు  బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి , రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్, శ్రీకాళహస్తి డివిజన్ వారు ఆదేశముల మేరకు  శ్రీకాళహస్తి  పట్టణ  ప్రజల సౌకర్యార్థం ఎం.ఎం. వాడలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు , డ్రైనేజీ నిర్మాణ పనులకు నేడు మునిసిపల్ కమీషనర్  ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు ద్వారా మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని వివరించారు. స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ సిబ్బంది మరియు 19 వ వార్డ్ సంబంధిత  ప్రజాప్రతినిధులు,  స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.