chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 2:28 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఎంపీటీసీ ఎన్నికలకు అధికారుల సన్నద్ధత

తొట్టంబేడు, చిత్తూరు ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 11
తొట్టంబేడు మండలంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన
తొట్టంబేడు మండలం రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తూ మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలంలోని చిట్టతూరు పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో సురేంద్రనాథ్, చిట్టతూరు గ్రామ అభివృద్ధి అధికారి శాంతితో కలిసి పరిశీలించారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఎంపీడీవో సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.