chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 9:52 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఉచిత వేసవిబడి విద్యార్థులకు అన్నదానం

హిందూపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 23:

 

హిందూపురం పట్టణం త్యాగరాజనగర్‌లోని మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో కొనసాగుతున్న 28వ సంవత్సర ఉచిత వేసవిబడి విద్యార్థులకు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యలక్ష్మి ఫ్లవర్ డెకరేషన్ ఆధ్వర్యంలో నాగరత్న – మోహన్ కుమార్ దంపతుల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వేసవిబడిలో పాల్గొంటున్న విద్యార్థులకు స్థానిక విడి రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ యాజమాన్యం ప్రతిమ – ప్రశాంత్ దంపతులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కె. సాయికళ – కె.మాళప్ప దంపతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక, నైతిక విలువలను అందించే ఉద్దేశంతో ఉచిత వేసవిబడి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అన్నదానం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె. మాళప్ప,కె.సాయికళ, మమత, కుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.