chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 10:00 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఉగాది – రంజాన్ పండుగల నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక సమావేశంలో  డీఎస్పీ పార్థసారథి

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 17 :

 

ఉగాది, రంజాన్ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కుప్పం డీఎస్పీ పార్థసారథి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, సోదర భావంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పోలీసు శాఖతో సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబుదుగూరు ఎస్‌ఐ నరేష్, పీస్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.