chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 10:20 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఇంటి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన డాక్టర్ సుధీర్ 

 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మార్చి05:

 

 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా అనే లక్ష్యంతో 167 బూత్‌లో డాక్టర్ సుధీర్ నేతృత్వంలో కేఎస్‌ఎస్ సభ్యులు 20వ వార్డు ఇంటి ఇంటికీ పర్యటించారు. వార్డులోని కేఎస్‌ఎస్ కుటుంబాలను కలుసుకుని వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. పథకాల అమలు, ప్రజల అభిప్రాయాలు సేకరించారు.సేవల్లో లోటు ఉంటే పరిష్కార చర్యలు చేపడతామని కె కన్నన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు పూర్తిగా చేరాలంటే అధికారులు, ప్రజల మధ్య సమన్వయం బలపడాలని టిడిపి నాయకులు అన్నారు. సేకరించిన సూచనల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాయి. ప్రజలమధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమని పేర్కొన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే పథకాలు సమర్థవంతంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ సోమశేఖర్, బూత్ ఇంచార్జ్ లోకేష్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.