

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 24:
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా అనే లక్ష్యంతో 11వ క్లస్టర్ ఇంచార్జ్ కె.కన్నన్ ,కొత్తపేట యూనిట్ ఇంచార్జ్ అప్పు,( ముఖేష్ )13వ వార్డులో ఇంటి ఇంటికీ పర్యటించారు. వార్డులోని కె.ఎస్.ఎస్ కుటుంబాలను కలుసుకుని వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. పథకాల అమలు, ప్రజల అభిప్రాయాలు సేకరించారు. సేవల్లో లోటు ఉంటే పరిష్కార చర్యలు చేపడతామని కె.కన్నన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు పూర్తిగా చేరాలంటే అధికారులు, ప్రజల మధ్య సమన్వయం బలపడాలని టిడిపి నాయకులు అన్నారు. సేకరించిన సూచనల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాయి. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమని పేర్కొన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే పథకాలు సమర్థవంతంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో లోకేష్,ఎం.కె.మణి,మాజీ ఎంపీటీసీ క్రిష్ణ,ప్రసాద్, మోహన్, మంజునాథ్, దినేష్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.