శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం రెండో రోజూ కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా పట్టణ మైనారిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు వివిధ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ బాషా, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ షఫీ, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ కరీం, మాజీ కౌన్సిలర్ బషీర్, అస్మత్, ఐటీడీపీ ఖాదర్, సి.ఎస్. మస్తాన్, వార్డు అధ్యక్షులు కరీం, ముజీబ్, సాయి, రఫీభాయ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఫ్రూట్ మీర్జా, అధికార ప్రతినిధి జహీర్ అహ్మద్, దర్గా షఫీ యూనిట్ ఇన్‌చార్జి, చంద్ భాయ్, బూత్ ఇన్‌చార్జి ముజీప్, టౌన్ ఉపాధ్యక్షుడు ఆరిఫ్, అన్సర్ తదితరులు పాల్గొన్నారు.
