chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:26 am Digital Edition : CHITTOORE EXPRESS

ఆరిమాని గంగమ్మ దసరా మహోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన.. ఆలయ పాలకమండలి

ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 04 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ దసరా మహోత్సవం కార్యక్రమానికి.. ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ డాక్టర్ థామస్ ను ఆలయ పాలకమండలి ఆహ్వానించింది.. దసరా మహోత్సవానికి తప్పనిసరిగా హాజరవుతానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు.. దసరా ఉత్సవాలను ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆలయ పాలక మండలికి ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకట్ రాయల్ ఆలయ చైర్మన్ జలంధర్ నాయుడు కమిటీ సభ్యులు అమృత చందు, ఆలయ సిబ్బంది ప్రకాష్ పాల్గొన్నారు.