తిరుపతి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి19:
తిరుపతిలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని తిరుపతి లోక్‌సభ సభ్యుడు మద్దిల గురుమూర్తి సందర్శించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వివిధ వ్యవసాయ పరిశోధనలు,కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి,రైతులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలపై అధికారులు,శాస్త్రవేత్తలు ఎంపీకి వివరించారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్‌కు ఉపయోగపడే బయోపెస్టిసైడ్స్ అభివృద్ధి, తయారీ విధానం, పంటలపై ప్రభావం,ఖర్చు తగ్గింపు,పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి విశదీకరించారు.రసాయన ఎరువులు, కీటకనాశకాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో ఈ బయోపెస్టిసైడ్స్ కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు.సహజ సూక్ష్మజీవులు,వృక్షసారాల ఆధారంగా తయారయ్యే ఈ ఉత్పత్తులు మట్టి సారాన్ని కాపాడుతూ.., రైతులకు ఆరోగ్యకరమైన,నిలకడైన వ్యవసాయ పద్ధతుల ను అందిస్తున్నాయి.ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ… స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికోసం పరిశోధనాసంస్థలు అభివృద్ధిచేస్తున్న సాంకేతికతలను గ్రామస్థాయికి చేరవేయా లని అన్నారు.రైతులకు అవగాహన కార్యక్రమాలునిర్వహిం చి, బయోపెస్టిసైడ్స్ వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించా రు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయం సమన్వయంతో రైతులకు మద్దతు ఇస్తే ఆర్గానిక్ వ్యవసాయం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.