chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:27 am Digital Edition : CHITTOORE EXPRESS

ఆకుపై మత సామరస్య చిత్రం మరోసారి ప్రతిభ చాటిన రాళ్లబూదుగూరు చిత్రకారుడు బి.ఎం. సురేష్

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్ ,సెప్టెంబర్ 30:

 

వినూత్న చిత్రకళతో పలువురిని అబ్బురపరుస్తున్న కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు గ్రామానికి చెందిన చిత్రకారుడు బి.ఎం. సురేష్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యాన్ని చాటిచెప్పేలా గంగిరేణి ఆకుపై అద్భుతమైన సూక్ష్మ చిత్రాన్ని రూపొందించారు. గంగిరేణి ఆకుపై మసీదులో అల్లాను ప్రార్థిస్తున్న ఓ ముస్లిం వ్యక్తి చిత్రాన్ని అత్యంత సూక్ష్మంగా, కళాత్మకంగా చిత్రీకరించారు. చిన్నపాటి ఆకుపై ఇంత చక్కగా చిత్రాన్ని రూపొందించడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మతాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని స్థానికులు అభినందిస్తున్నారు. బి.ఎం. సురేష్ గతంలో ఆవు వెంట్రుకపై శ్రీకృష్ణుని చిత్రం, నెమలి ఈకపై శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆకుపై మత సామరస్యాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని రూపొందించడంతో ఆయన కళా ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. సూక్ష్మ చిత్రకళ ద్వారా సామాజిక సందేశాన్ని అందిస్తున్న సురేష్‌ను పలువురు అభినందించారు.