
భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 07:
అలల పలుకుల్లో ఆవేదన విన్న
పత్తిపాటి కలం పలుకుతోంది—
అలల కన్నీటి చుక్కలో
అఖిల జగతి వేదన దాగి ఉందని…!
సాగర హృదయ స్పందనలో
సృష్టి శ్వాస నిలిచి ఉందని…!
నీలి నీటిలో నిండిన జీవరాశులు,
నిశ్శబ్దంగా మన తప్పుల భారాలు మోస్తూ…
ప్లాస్టిక్ పాశంలో చిక్కుకుని
ప్రాణాలు విడుస్తున్నాయని…!
గాలికి గానమై…
భూమికి ప్రాణమై…
ప్రకృతికి పరిమళమై…
పరవశించే సాగరాన్ని,
మలినం చేస్తూ మనమే
వినాశన తీరాలకు చేరుతున్నామని…!
కాలుష్యపు కత్తి గాట్లకు
సాగర కలలు చిద్రమయ్యాయని…
అంతులేని ఆ జలనిధి
అశ్రుధారలు కారుస్తోందని…!
సముద్రం బ్రతికితేనే
సృష్టి చిరునవ్వు చిందిస్తుందని…!
సముద్రం నవ్వితేనే
భవిష్యత్తు వెలుగులు విరజిమ్ముతాయని…!
అని పత్తిపాటి కలం పలుకుతోంది…!
జూన్ ఎనిమిది ఒక తేదీ మాత్రమే కాదు,
జీవరక్షణకు జాగృతి చేసే పిలుపు ఇది…!
సృష్టి కోసం మన బాధ్యతను
గుర్తుచేసే సమయం ఇది…!
సాగరాన్ని కాపాడుదాం…
సృష్టిని నిలబెట్టుదాం…!!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.