
శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు01:
పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం శాంతిపురం మండలంలోని నాలుగు పంచాయతీల పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటపల్లి, సోగడబల్ల, రేగడదిన్నెపల్లి, అనికేర క్రాస్ (చంద్రగిరి), బ్రాహ్మణకొత్తూరు గ్రామాల్లో సుమారు 126 మంది లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.4,000, రూ.10,000, రూ.15,000 చొప్పున వివిధ వర్గాల లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది,గ్రామ ప్రముఖులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.