chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 10:40 am Digital Edition : CHITTOORE EXPRESS

అప్పు అడిగినందుకే చంద్రమను హత్య చేశారు  డి.ఎస్.పి. ప్రభాకర్

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 02

 

పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన శ్రీనివాసులు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. చీటీల డబ్బు, అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు రెండు లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్ పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలెరో వాహనాన్ని బాడుగకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యం ను విచారించాగా మరో ఇద్దరితో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రమణి అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్ లను తొందర్లోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్ని సాక్ష్యాదారాలు సేకరించామన్నారు.