chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 10:19 pm Digital Edition : CHITTOORE EXPRESS

అన్న క్యాంటీన్లలో ఉచిత అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:

 

శ్రీకాళహస్తి సోమవారం మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా నారా భువనేశ్వరి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి రామసేతు వంతెన వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ సందర్శించి, భక్తులకు , ప్రజలకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ద్వారా వేలాది మందికి ఉచితంగా భోజనం అందించడం చాలా సంతోషంగా ఉంది. భోజనం చేస్తున్న వారితో బొజ్జల బృందమ్మ మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలకు అండగా ఉండటమే మా ప్రభుత్వ , మా కుటుంబ ఆశయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యుడు గాదేపాకుల గోపి,శ్రీకాళహస్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు,ముత్యాలమ్మ దేవస్థానం అధ్యక్షురాలు బి. రేణుక దేవి,షాకిర్ అలీ,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.