chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 8:53 am Digital Edition : CHITTOORE EXPRESS

అన్నా క్యాంటీన్‌లో హర్ష ధర్మ తేజ పుట్టినరోజు వేడుకలు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కుటుంబ సభ్యులు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే09:

 

కుప్పంలోని అన్నా క్యాంటీన్‌లో లయన్స్ క్లబ్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోపినాథ్ కుమారుడు హర్ష ధర్మ తేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్‌కు వచ్చిన పేదలు, కార్మికులు, ప్రయాణికులకు భోజన వసతి కల్పించారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. అలాగే హర్ష ధర్మ తేజ కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్ సేవా ట్రస్టుకు ఐదు వేల రూపాయలను విరాళంగా అందజేశారు. దాతృత్వానికి గుర్తుగా కుప్పం అన్నా క్యాంటీన్ సలహా కమిటీ సభ్యుడు మహేష్ హర్ష ధర్మ తేజకు దాతృత్వ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగభూషణం, జయంతి, అన్నా క్యాంటీన్ పర్యవేక్షకురాలు మంజు, లయన్స్ క్లబ్ సభ్యులు జయరాం నాయుడు, ప్రసాద్, ఏకాంబరం, అన్నా క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొంటూ హర్ష ధర్మ తేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.