chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 10:47 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఐ.ఎ.ఎస్ అధికారి వికాస్ మరమ్మత్ వివాహానికి హాజరైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి19

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో ఐఏఎస్ అధికారి వికాస్ మరమ్మత్ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ వివాహం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ శుభ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు, తన సతీమణి నారా భువనేశ్వరి కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులతో ప్రత్యేకంగా మాట్లాడిన వారు నూతన వధూవరులు జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన వివాహ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హాజరు కావడం నూతన వధూవరులతోపాటు కుప్పం నియోజకవర్గ ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా కుప్పం ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానులు కూడా తమ శుభాకాంక్షలను తెలియజేశారు. వివాహ వేడుక అనంతరం అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయగా, కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.