chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 12:10 pm Digital Edition : CHITTOORE EXPRESS

అగ్నిగుండం కార్యక్రమం సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలుప్రయాణికులు పట్టణ ప్రజలు సహకరించాలి టూ టౌన్ సిఐ నాగరాజు

శ్రీకాళహస్తి , చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి శ్రీ ద్రౌపతి ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న అగ్నిగుండం కార్యక్రమం నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి టూ  టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి టౌన్ నుంచి పిచ్చాటూరు, కేవీబీ పురం వైపు వెళ్లే వాహనాలు ఎన్‌టీఆర్ సర్కిల్–హాస్పిటల్ రోడ్–ఎస్‌ఎస్ కళ్యాణమండపం–ఎంజీఎం సర్కిల్–చిలకవారి కండ్రిగ మార్గంలో ప్రయాణించాలని సూచించారు.
పిచ్చాటూరు వైపు నుంచి శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చే ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు రామచంద్రాపురం,చిలకవారి కండ్రిగ,ఎంజీఎం సర్కిల్–ఎస్‌ఎస్ కళ్యాణమండపం మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలని తెలిపారు. బైపాస్ మార్గంలో వచ్చే వాహనాలు నంది సర్కిల్ నుంచి తిరుపతి వైపు వెళ్లాలని, ఆర్టీసీ బస్సులు మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు వచ్చి అక్కడి నుంచే తిరుగు ప్రయాణం చేయనున్నట్లు పేర్కొన్నారు. బి.ఎన్. కండ్రిగ నుంచి శ్రీకాళహస్తి లేదా తిరుపతి వైపు వచ్చే వాహనాలు ఎంజీఎం సర్కిల్–ఎస్‌ఎస్ కళ్యాణమండపం–హాస్పిటల్ రోడ్ మార్గాన్ని వినియోగించాలని, బైపాస్ నుంచి వచ్చే వాహనాలు నంది సర్కిల్ మీదుగా వెళ్లవచ్చని తెలిపారు. శ్రీకాళహస్తి టౌన్ నుంచి బి.ఎన్. కండ్రిగ వైపు వెళ్లే వాహనాలు ఎన్‌టీఆర్ సర్కిల్–హాస్పిటల్ రోడ్–ఎస్‌ఎస్ కళ్యాణమండపం–ఎంజీఎం సర్కిల్ మార్గంలో ప్రయాణించాలని సూచించారు.తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వచ్చే వాహనాలు ఏపీ సీడ్స్,ఓల్డ్ బైపాస్ రోడ్డు–నంది సర్కిల్–తేట్టు సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలని తెలిపారు. నెల్లూరు, నాయుడుపేట వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు కూడా నంది సర్కిల్,తేట్టు సర్కిల్ మార్గాన్నే వినియోగించాలని సూచించారు.అగ్నిగుండం కార్యక్రమం సందర్భంగా టౌన్ లోపలి నుంచి గానీ, బయట నుంచి గానీ శ్రీ ధర్మరాజు స్వామివారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఆటోలు, కార్లు, ట్రాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు స్పష్టం చేశారు.ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించి కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.