chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:27 am Digital Edition : CHITTOORE EXPRESS

అంతర్ పంటలతో అధిక లాభాలు…  ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ థామస్  అన్నదాత సుఖీభవ 20 కోట్ల 43 లక్షల చెక్కు పంపిణీ 

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 13:

 

ప్రతి రైతు అంతర్పంటతోనే అధిక లాభాలు పొందవచ్చు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండల కార్యాలయం వద్ద గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తామస్ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ రైతులు చెరుకు వరి మామిడి ఇలాంటి పంటలతో పాటు అంతర్ పంటలు పండించాలని తెలిపారు డ్రాగన్ ఫ్రూట్స్ పండ్లు వివిధ రకాల పండ్లు చెట్లను పండించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు అని రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే తెల్లటి బియ్యం వండిన అన్నమును తగ్గించి ఆరోగ్యకరమైన పండ్లు, రాగి జావా రొట్లో వంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అని తెలిపారు… అనంతరం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక పండించిన పంట నమ్ముకోలేక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్ని విధాల అభివృద్ధి పరిచేలా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు షణ్ముగం తెలియజేశారు అనంతరం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 36047 మంది రైతులకు 20 కోట్ల 43 లక్షల అన్నదాత సుఖీభవ చెక్కును రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో.. ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు. రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ డైరెక్టర్ నాగేశ్వర రాజు, బిజెపి ఇన్చార్జ్ రాజేంద్రన్, సహకార సంఘ చైర్మన్ నిరంజన్ రెడ్డి, పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణమా నాయుడు, యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సోదరుడు రాజా, ఎంపీడీవో వనజ, మండల వ్యవసాయ అధికారి. అజిత గంగాధర్ నెల్లూరు మండల వ్యవసాయ అధికారి భవాని పాలసముద్రం వ్యవసాయ అధికారి ఢిల్లీ ప్రసాద్ పెనుమూరు వ్యవసాయ అధికారి వరలక్ష్మి రైతులు తదితరులు పాల్గొన్నారు.